యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Dec 5 2025 6:07 AM | Updated on Dec 5 2025 6:07 AM

యువకు

యువకుడి ఆత్మహత్య

పెగడపల్లి: కుటుంబసభ్యులు మందలించడంతో బీటెక్‌ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాములపల్లిలో చోటుచేసుకుంది. స్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నీలం రమేశ్‌, జమున దంపతులకు కూతురు వర్షిత, కుమారుడు అరవింద్‌ ఉన్నారు. అరవింద్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. మంచి ఉద్యోగం చూసుకోవాలని కుటుంబ సభ్యులు అరవింద్‌ను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అరవింద్‌ బుధవారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో మహిళ..

చందుర్తి(వేములవాడ): ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్నసిరిసిల్ల చందుర్తి మండలం బండపల్లిలో విషాదం నింపింది. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాలు. బండపల్లికి చెందిన నేదూరి అంజవ్వ(55)కు భర్త పోశయ్యతోపాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. జీవనోపాధి కోసం కొనుగోలు చేసి హార్వెస్టర్‌ను కొనుగోలు చేయగా ఆర్థికంగా నష్టపోయారు. హర్వెస్టర్‌ విక్రయించిన అప్పులు తీరలేదు. దీనికితోడు వ్యవసాయంలో వచ్చిన నష్టంతో పూర్తిగా దివాళ తీశారు. దీంతో అప్పులిచ్చిన వారు అప్పులు చెల్లించాలని కోరితే ముగ్గురు కుమారులు పట్టించుకోకుండా పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై అంజవ్వ ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకుంది. మృతురాలు అంజవ్వ తల్లి రాజవ్వ వృద్ధాప్యంలో అనా రోగ్యంతో బాధపడుతోంది. ఏకై క కుమార్తె అంజవ్వ ఆత్మహత్య చేసుకోవడంతో నాకు దిక్కెవరూ అంటూ తల్లి రాజవ్వ రోదిస్తుండడంతో అక్కడున్న వారందరూ కన్నీరుపెట్టారు. కాగా అంజవ్వ భర్త పోశయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రైలు కిందపడి యువకుడు..

జమ్మికుంట: అనారోగ్య కారణాలతో రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామంగుండం రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. తనుగుల గ్రామానికి చెందిన జక్కె రజనీకాంత్‌(31) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బిజిగిరి షరీఫ్‌, పొత్కపల్లి రైల్వేస్టేషన్‌ మధ్య తనుగుల సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తల్లి జక్కె రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

జీవితంపై విరక్తి చెంది డ్రైవర్‌..

ముస్తాబాద్‌(సిరిసిల్ల): జీవితంపై విరక్తి చెంది ఓ డ్రైవర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్‌ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన సద్ది రాజిరెడ్డి(40) తల్లితో కలిసి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇంటిలో ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం రాజిరెడ్డి భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసగా మారాడు. బుధవారం రాత్రి భోజనం చేసిన తన గదిలో నిద్రించాడు. వరండాలో తల్లి సత్తవ్వ పడుకుంది. మరుసటి రోజు గురువారం ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకులు రాజిరెడ్డి ఇంటికెళ్లారు. సత్తవ్వతో మాట్లాడగా, రాజిరెడ్డి కోసం ఆరా తీశారు. ఇంకా లేవలేదని తల్లి తెలపగా.. సదరు నాయకులు తలుపులు తట్టిన స్పందన రాలేదు. దీంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. సత్తవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కువైట్‌లో వలసజీవి మృతి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లిన వలసజీవి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రానికి చెందిన ఎండీ వేదుల్‌(36) కువైట్‌లో పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం ఫుడ్‌పాయిజన్‌కు గురైన వేదుల్‌ను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస వదిలాడు. మృతునికి భార్య షబానా, కుమారుడు, కూతురు ఉన్నారు. వేదుల్‌ మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించి, గల్ఫ్‌ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

యువకుడి ఆత్మహత్య
1
1/3

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య
2
2/3

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య
3
3/3

యువకుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement