దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి

Dec 4 2025 7:16 AM | Updated on Dec 4 2025 7:16 AM

దివ్య

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి

మెట్‌పల్లి: దివ్యాంగుల రక్షణకు ప్రత్యేక చట్టా లున్నాయని, వాటిని వినియోగించుకోవాలని సీనియర్‌ సివిల్‌ మేజిస్ట్రేట్‌ నాగేశ్వర్‌రావు సూ చించారు. పట్టణంలోని బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో బుధవారం మండల లీగల్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం న్యా య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. దివ్యాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని, న్యాయపరంగా వారికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కంతి మోహన్‌రెడ్డి, న్యాయవాదులు ఉన్నారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

మల్యాల: కొండగట్టు అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు వడ్డీలేని రుణాలు అందిస్తామని డీఆర్‌డీఓ ఏపీడీ సునీత అన్నారు. కొండగట్టు అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు జిల్లా సమైఖ్య సభ్యులు ఒక్కో కుటుంబానికి రూ.5వేల చొప్పున రూ.1.50లక్షల ఆర్థికసాయం అందించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షురాలు సరోజన, ప్రాజెక్టు మేనేజర్‌ రమేశ్‌, నారాయణ, ఏపీఓ గంగాధర్‌, దేవయ్య, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యం చేరేందుకు శ్రమించాలి

మల్లాపూర్‌: విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చేందుకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యాధికారి నారాయణ అన్నారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బుధవారం తనిఖీ చేశా రు. కళాశాలలో వసతులను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్‌లోనే విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా శ్రమించాలన్నారు. కమ్యూనికేషన్‌, రైటింగ్‌ స్కిల్స్‌లో ప్రా వీణ్యం పొందాలన్నారు. కష్టపడి చదివి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్‌ బండిసత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

సీఎం దిష్టిబొమ్మల దహనం

జగిత్యాలటౌన్‌/రాయికల్‌/ధర్మపురి: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో దహనం చేశారు. జిల్లాకేంద్రంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు ఆధ్వర్యంలో తహసీల్‌ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. రాయికల్‌లో గాంధీచౌక్‌ వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్‌, ప్రధాన కార్యదర్శి భూమేశ్‌, నాయకులు సామల్ల సతీశ్‌, గాజంగి అశోక్‌, వట్టిమల్ల శ్రీను, సత్యం తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గాజు భాస్కర్‌, బెజ్జారపు లవన్‌కుమార్‌, బండారి లక్ష్మణ్‌, స్తంభంకాడి శ్యామ్‌, ఆకుల శ్రీనివాస్‌ ఉన్నారు.

యావర్‌రోడ్డు ఆక్రమణలపై కలెక్టర్‌ దృష్టి

జగిత్యాలటౌన్‌: జిల్లాకేంద్రంలోని యావర్‌రోడ్డులో ఆక్రమణపై చర్యలు తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. 1989 నాటి మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం యావర్‌రోడ్డును 80ఫీట్లకు ఆమోదం తెలిపినప్పటికీ సెట్‌ బ్యాక్‌ లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి గతనెల 24న కలెక్టర్‌కు లేఖ రాసిన విషయం తెల్సిందే. దీంతో రాజాగౌడ్‌ అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి1
1/3

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి2
2/3

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి3
3/3

దివ్యాంగులు చట్టాలను వినియోగించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement