నామినేషన్‌ సెంటర్ల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ సెంటర్ల తనిఖీ

Dec 4 2025 7:16 AM | Updated on Dec 4 2025 7:16 AM

  నామ

నామినేషన్‌ సెంటర్ల తనిఖీ

గొల్లపల్లి/పెగడపల్లి: నామినేషన్‌ కేంద్రాల వద్ద పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. మూడో విడత ఎన్నికల్లో భాగంగా గొల్లపల్లి మండలకేంద్రంతోపాటు, చిల్వాకోడూర్‌, తిరుమలాపూర్‌, పెగడపల్లి మండలం నంచర్లలోని నామినేషన్‌ కేంద్రాలను బుధవారం సందర్శించారు. ఈనెల 5 వరకు నామినేషన్లు స్వీకరించాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ హారిణి, తహసీల్దార్లు మాజీద్‌, ఆనందర్‌కుమార్‌, ఎంపీడీవోలు రవీందర్‌, ప్రేమ్‌సాగర్‌ ఉన్నారు.

రెండో విడత ప్రశాంతం

జగిత్యాల: జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. ఏడు మండలాల్లో 144 గ్రామపంచాయతీలకు 941 నామినేషన్లు, 1276 వార్డు స్థానాలకు 2,927 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

జగిత్యాలక్రైం: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల నేపథ్యంలో సోషల్‌మీడియాపై నిఘా పెంచామన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్‌ అధికారులతో సమావేశమయ్యారు. మూడు విడుతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. అధికారులు సిబ్బందికి మార్గదర్శనం చేస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మద్యం, నగదు, ఉచితాల పంపిణీపై నిఘా పెంచాలన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సర్ర్‌పైజ్‌ వెహికల్‌ చెకింగ్‌ చేపట్టాలన్నారు. నేరాలకు పాల్పడేవారు, రౌడీషీటర్స్‌పై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఉంచాలన్నారు. విద్వేషాలు రేచ్చగొట్టేలా.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా వచ్చే ప్రకటనలు పోస్ట్‌ చేసినా.. షేర్‌ చేసిన వారితోపాటు గ్రూప్‌ అడ్మిన్‌లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీలు వెంకటరమణ, రఘుచందర్‌, రాములు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

  నామినేషన్‌ సెంటర్ల తనిఖీ1
1/1

నామినేషన్‌ సెంటర్ల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement