ఫ్యూచర్ సిటీ కాదు..
పెండింగ్ పనులు పూర్తి చేయండి
మెట్‌పల్లి: కొత్తగా ఫ్యూచర్ సిటీని నిర్మించే ముందు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలో శిథిలావస్థలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వాసుపత్రి, సమీకృత మార్కెట్ భవనాలను బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హాయాంలో చేపట్టిన ప్రభుత్వాసుపత్రి, సమీకృత మార్కెట్ భవనాల పనులు 90శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన చిన్నచిన్న పనులను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా నిర్లక్ష్యం చూపుతోందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రజాఅవసరాలపై దృష్టి పెట్టని ప్రభుత్వం కొత్తగా ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీలు నిర్మిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌రావు, అంగడి పురుషోత్తం, గజం రవి, మోరెపు తేజ తదితరులున్నారు.


