బల్దియాలో అవినీతిని అరికట్టండి
మెట్‌పల్లి: మెట్‌పల్లి బల్దియాలో అవినీతిని ఉన్నతాధికారులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాల్లో అధికారులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో ప్రజల నుంచి లంచాలు వసూలు చేయిస్తున్నారని, వార్డుల్లో వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. మున్సిపాలిటీని అవినీతికి అడ్డాగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు సుంకేట విజయ్, మద్దెల లావణ్య, బొడ్ల నగేష్, కొయ్యల లక్ష్మణ్, తోకల సత్యనారాయణ తదితరులున్నారు.


