మల్లన్నస్వామికి బోనం మొక్కులు | - | Sakshi
Sakshi News home page

మల్లన్నస్వామికి బోనం మొక్కులు

Dec 4 2025 7:16 AM | Updated on Dec 4 2025 7:16 AM

మల్లన్నస్వామికి   బోనం మొక్కులు

మల్లన్నస్వామికి బోనం మొక్కులు

గొల్లపల్లి: మండలంలోని మల్లన్నపేట శ్రీమల్లికార్జునస్వామి జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం దండివారం సందర్భంగా సుమారు 17వేల మంది భక్తులు బోనాలు తీసి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.79,510 ఆదాయం సమకూరింది. డిప్యూటీ ట్రైనింగ్‌ కలెక్టర్‌ కన్నం హారిణి స్వామివారిని దర్శించుకున్నారు. ఫౌండర్‌ ట్రస్టీ కొండూరి శాంతయ్య, ఈవో ముద్దం విక్రం, అర్చకులు రాజేందర్‌, సీఐ నర్సింహా రెడ్డి, శ్రీనివాస్‌, ఎస్సైలు కృష్ణసాగర్‌రెడ్డి, గీత, కుమారస్వామి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement