ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
ఎన్నికల్లో బందోబస్తు ఎలా చేపడుతున్నారు..?
ఇప్పటివరకు ఏమైనా కేసులు నమోదయ్యాయా..?
మండలస్థాయిలో బృందాలు ఏర్పాటు చేశారా..?
జిల్లాలో ఎన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి..?
సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు..?
ఇప్పటివరకు ఎంతమందిని బైండోవర్ చేశారు..?
ప్రచారానికి, సమావేశాలకు అనుమతి తీసుకోవాలా..?
జగిత్యాలజోన్: జగిత్యాలరూరల్ మండలం వెల్దుర్తి అనుబంధం బా వోజిపల్లె. ఇక్కడ బావోజోల్లు, బుడిగెజంగాల వారు ఉంటారు. చిలుక జ్యోతిష్యం చెబుతుంటారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీరంతా ఒకేమాటకు కట్టుబడి ఉంటున్నారు. వెల్దుర్తి పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి బావోజిపల్లెకు సర్పంచ్ పదవి లభించలేదు. 20 ఏళ్ల క్రితం ఇక్కడ 180 ఓట్లు ఉండగా.. ప్రస్తుతం 300కు చేరాయి. ఈ సారి సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ కావడంతో ఎలాగైనా పదవిని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వెల్దుర్తిలో 1450 ఓట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి సుమారు ఇద్దరుముగ్గురు బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓట్లు చీలితే.. రెండువార్డులు.. ఎస్సీ సామాజికవర్గమే ఉన్న బావోజిపల్లెకు ఈసారి సర్పంచ్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.
పోస్టల్ బ్యాలెట్‌కు ఆసక్తి చూపని ఉద్యోగులు
రాయికల్: స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు ఉద్యోగులు ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగులు, సైనికులు ఎలక్షన్ విధులు నిర్వర్తించే ఉద్యోగులు, ఖైదీలు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో పోస్టల్ బ్యా లెట్‌లో ఓటు వేయడం ద్వారా ఎన్నికల ఫలితాల రోజు అభ్యర్థులకు చూపించుకుంటూ ఓట్లు లెక్కిస్తారు. స్థానికంగా సర్పంచ్ ఎన్నికల్లో తక్కువ మంది పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు ఉండటంతో తాము వేసి న ఓటు ఎవరికి వేసిందో తెలుస్తుందనే ఉద్దేశంతో ఓటు వేసి తలనొప్పి తెచ్చుకునే బదులు వేయకుండా ఉండాలని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం లేదు
రాయికల్: ఏకగ్రీవ గ్రామాలకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ప్రోత్సాహకం వస్తుందని చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకం కింద ఎలాంటి ప్రకటనా రాలేదని డీపీవో రఘువరణ్ తెలిపా రు. తమ సెగ్మెంట్ పరిధి లో ఏకగ్రీవమైతే ఎంపీలు, మంత్రులు బీజేపీ తరుఫున కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి నిధులు మంజూరు చేస్తామని ప్రకటిస్తున్నారుగానీ.. ప్రభుత్వం నుంచి మాత్రం ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం.
సర్పంచ్‌కు గులాబీ.. వార్డు సభ్యులకు తెలుపు
రాయికల్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే ప్రక్రియలో భాగంగా ఓటరుకు ఇచ్చే బ్యాలెట్ పత్రాల్లో రెండు రంగుల్లో ఉంటాయి. సర్పంచ్‌కు వేసే బ్యాలెట్ పత్రం గులాబీ రంగులో ఉంటుంది. వార్డు సభ్యులకు వేసే బ్యాలెట్ పత్రం తెలుపురంగులో ఉంటుంది. ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల్లో గులాబీ, తెలుపు బ్యాలెట్ పత్రాలపై ఓటు వేయాల్సి ఉంటుంది.
జగిత్యాలక్రైం: జిల్లాలో
మూడు విడతలుగా జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై ఆయన ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడారు.
ఒకేమాటపై బావోజిపల్లె
అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవచ్చు
రాయికల్: సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో నామినేషన్లపై ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే సరైన ఆధారాలు సమర్పిస్తే ఆర్వోలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. అన్ని పత్రాలు సరిగా ఉంటే ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. ఒకవేళ తిరస్కరణకు గురైతే సదరు అభ్యర్థి ఆర్డీవోకు అప్పీలు చేసుకోవచ్చు. రెండు రోజుల నిర్ణీత గడువులోపు పరిష్కరించుకోవాలి.
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


