‘మల్చర్’ యంత్రంతో కొయ్యకాలు ముక్కలు
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు అవగాహనతో వరి కొయ్యకాళ్లను కాల్చడం లేదు. అలాగే కొయ్యకాళ్లను కలియదున్నేందుకు ముందుగా ట్రాక్టర్‌కు బిగించిన మల్చర్ యంత్రం వినియోగిస్తున్నారు. ఈ ఆధునాతన పరికరం ట్రాక్టర్‌తో నడుస్తుంది. 5 నుంచి 7 అడుగుల వెడల్పుతో రోటోవేటర్‌ను పోలి ఉంటుంది. యంత్రంలోని బ్లేడ్లు కొయ్యకాళ్లను చిన్న ముక్కలుగా కట్ చేస్తాయి. ఎకరం పొలంలో గడ్డిని కట్ చేసేందుకు గంట సమయం పడుతుంది. దీని ధర రూ.లక్ష వరకు ఉంటుంది. ఎకరం పొలంలోని కొయ్యకాళ్లు రెండు ట్రాక్టర్ల పశువుల ఎరువుతో సమానం. పొలంలోనే కలియదున్నడం వల్ల 15 కిలోల భాస్వరం, 15 కిలోల యూరియా, 8 కిలోల పొటాష్ లభిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


