దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
జగిత్యాల: దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని, వారి కోసం ప్రత్యేకమైన క్రీడాపోటీలు నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ లత అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల ఆధ్వర్యంలో మినీస్టేడియంలో క్రీడాపోటీలు నిర్వహించారు. దివ్యాంగులు ప్రతి రంగంలో ప్రతిభ చాటాలన్నారు. వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులు రన్నింగ్, షాట్‌పుట్, జువెలెన్‌త్రో, ఫీల్డ్ ఈవెంట్స్‌లో ప్రతిభ కనబర్చారు. వారికి బహుమతులు అందజేశారు. యువజన క్రీడా అధికారి రవికుమార్, డీఈవో రాము, సీడీపీవో మమత, ఈవో పవిత్ర పాల్గొన్నారు.


