పోగొట్టుకున్న 136 ఫోన్లు అప్పగింత
జగిత్యాలక్రైం: పోగొట్టుకున్న.. చోరీకి గురైన ఫోన్లను సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా గుర్తించి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. వివిధ ఘటనలో చోరీకి గురైన రూ.28 లక్షల విలువైన 136 సెల్‌ఫోన్లను ఎస్పీ కార్యాలయంలో బాధితులకు అందించారు. ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా రూ.3.5 కోట్ల విలువైన 1548 ఫోన్లను బాధితులకు అప్పగించామన్నారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే ఆందోళన చెందకుండా.. సీఈఐఆర్ అప్లికేషన్‌లో నమోదు చేసుకుంటే గుర్తించి ఇస్తామని తెలిపారు. సెల్‌ఫోన్ల రికవరీ కోసం ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్సై హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు. ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్, సీఈఆర్‌ఐ టీం ఆర్‌ఎస్సై కృష్ణ, హెడ్‌కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుళ్లు అజర్ పాల్గొన్నారు.


