కాంగ్రెస్ తెచ్చిన విద్యుత్ పాలసీ బూటకం
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ పాలసీ పచ్చి బూటకమని, వారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. పవర్ ప్లాంట్లకు బీఆర్‌ఎస్ ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. కాంగ్రెస్ స్కాంలను హరీశ్‌రావు ఎండగడితే అతడి దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండించారు. దేశంలోనే అతి పెద్ద భూ స్కాం బయటపడగా, మళ్లీ రూ.50 వేల కోట్ల పవర్‌స్కాం వెలుగు చూసిందన్నారు. సీఎం రేవంత్ రామగుండంలో రూ.15 కోట్లతో పవర్‌ప్లాంట్ అంచనా వేశారని, ఇది ఇప్పటితో ఆగదన్నారు. వారు కమీషన్ల కోసమే వీటిని కడుతున్నారని ఆరోపించారు. ఎన్టీపీసీ తక్కువ ధరకే 2,400 మెగావాట్ల కరెంట్ ఇస్తామన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా బుగ్గారం మండలానికి చెందిన బీజేపీ నాయకులు పోలంపెల్లి మల్లేశ్, భరతపు గంగాధర్ బీఆర్‌ఎస్‌లో చేరారు. నాయకులు హరిచరణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


