పక్షవాత బాధితుడికి ఆర్థికసాయం
సారంగాపూర్(జగిత్యాల): బ్రెయిన్ స్ట్రోక్‌తో పక్షవాతం సోకి మంచానికి పరిమితమైన ఓ బాధితుడికి వైద్య ఖర్చుల కోసం రూ. 1.13 లక్షలు సాయం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. వివరాలు.. బీర్‌పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన బొమ్మిడి తిరుపతి బైక్ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏడు నెలల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మంచానికే పరిమితమయ్యాడు. పేదరికం కారణంగా అవసరమైన వైద్యసేవలు అందక మరింత ఆరోగ్యం క్షీణించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్.. తిరుపతి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దాతలు స్పందించి రాజ్యలక్ష్మి బ్యాంక్ ఖాతాకు రూ. 1.13 లక్షలు విరాళాలు అందించారు. ౖఈ నేపథ్యంలో వెద్యఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ధర్మపురి ఎస్‌బీఐ మేనేజర్ చేతుల మీదుగా రాజ్యలక్ష్మికి అందించారు. ఈ సందర్భంగా రమేశ్ చేసిన సాయానికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.


