నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
జగిత్యాలరూరల్: జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియను సజావుగా చేపట్టాలని డీపీవో రఘువరణ్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం మోతె, తిప్పన్నపేట గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసి మాట్లాడారు. అభ్యర్థుల వివరాలు పరిశీలించిన తర్వాతే నామినేషన్ స్వీకరించాలన్నారు. ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపివో వాసవి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేంద్రాల వద్ద వసతులు కల్పించాలి
నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థులకు కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించాలని డీపీవో (శిక్షణ) రేవంత్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం అనంతారం, పోరండ్ల, నర్సింగాపూర్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు నిబంధనల ప్రకారం నామినేషన్లు సమర్పించాలన్నారు. ఏదైనా అనుమానాలు ఉంటే స్థానిక అధికారులతో నివృత్తి చేసుకోవాలన్నారు. ఎంపీడీవో రమాదేవి, ఎంపీవో రవిబాబు ఉన్నారు.


