అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
జగిత్యాలటౌన్: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య కోరారు. ప్రతీ ఆదివారం భారత్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (డిక్కీ) ఆధ్వర్యంలో నిర్వహించే అంబేడ్కర్ స్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిపిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని ప్రశంసించారు. ప్రపంచ దేశాల్లో వారి విశ్వాసాలకు అనుగుణంగా భగవంతుని తర్వాత అత్యధికంగా ఆరాధించేది అంబేడ్కర్ మహశయుడినేనని పేర్కొన్నారు. జైభీం, జైసంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నల్ల శ్యాం, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, అనంతుల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.


