పరిశ్రమలు కావు.. పక్కలో బాంబులు
సింగరేణి గనులు, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఓపెన్‌కాస్ట్‌ల వల్ల ఉపాధి సంగతేమో కానీ, మా గోదావరిఖని పరిసర ప్రాంతాల పక్కలో బాంబుల్లా మారాయి. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి లీకవుతున్న విష వ్యర్థాలు నీరు, గాలిలో కలుస్తున్నాయి. ఫలితంగా స్థానికులకు శ్వాసకోస, కేన్సర్ తదితర వ్యాధులు వస్తున్నాయి. ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్ వల్ల వీర్లపల్లి వాసులకు వినికిడి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి, ఇతర సంస్థలు ఎప్పటికప్పుడు మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి విషవాయువులు వదిలినప్పుడు ఎలా ఎదుర్కోవాలో మాక్ డ్రిల్స్ నిర్వహించాలి.
– ప్రవీణ్, విఠల్‌నగర్, గోదావరిఖని


