ఖోఖోలో తృతీయస్థానం
చౌటుప్పల్‌రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న 69వ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు మంగళవారం ముగిశాయి. ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి. చివరి రోజు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లను తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, యాదాద్రి భువనగిరి డీఈవో సత్యనారాయణ ప్రారంభించారు. బాలికల విభాగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టు ప్రథమ స్థానంలో నిలువగా.. ద్వితీయస్థానంలో మహబూబ్‌నగర్, తృతీయ స్థానంలో నల్లగొండ జిల్లా జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్, ద్వితీయస్థానంలో రంగారెడ్డి, తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు అధికారులు బహుమతులు అందజేశారు. డిసెంబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగే జాతీయస్థాయి పోటీలకు రాష్ట్రం నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల విద్యాధికారి గురువారావు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి కె.దశరథరెడ్డి, ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి, తోట జయప్రకాశ్, టోర్నమెంట్ ఆర్గనైజర్ కృష్ణమూర్తి, బిక్కునాయక్, ప్రధానోపాధ్యాయులు సత్యనారా యణ, శ్రీనివాస్‌రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, వేణుగోపా ల్, టి.సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్తాచాటిన ఉమ్మడి జిల్లా బాలుర క్రీడాకారులు
ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు


