రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడి మృతి
కొండగట్టులో ‘సమ్మక్క’సందడి
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో సమ్మక్క, సారలమ్మ జాతర సందడి మొదలైంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు రాత్రి కొండపైనే బస చేసి వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంగళవారం వేలాదిమంది తరలిరావడంతో ఆలయ పరిసరాలు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. లడ్డూ, పులిహోరా విక్రయాలకు అదనంగా మరో కౌంటర్ ఏర్పాటు చేశారు. భక్తుల ప్రత్యేక దర్శనం టికెట్లు, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా ఆలయానికి రూ.5లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, ఏఈఓ హరిహరనాథ్ పర్యవేక్షించారు.
రామడుగు(చొప్పదండి): రామడుగు మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు పూరెల్ల శ్రీకాంత్‌గౌడ్ (35) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంగళవారం ఉదయం మృతిచెందాడు. వివరాలు.. శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు రామడుగుకు చెందిన వనపర్తి అరుణ్, పూరెల్ల సురేశ్ ద్విచక్రవాహనంపై షానగర్ నుంచి రామడుగు వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో శ్రీకాంత్‌గౌడ్ రోడ్డుపక్కన పడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య సుకృత ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి పరామర్శ
శ్రీకాంత్‌గౌడ్ మృతి వార్త తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మంగళవారం ఉదయం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అతడి మృతదేహానికి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడి మృతి


