జాతీయ కబడ్డీ పోటీలకు కీర్తన
కరీంనగర్‌స్పోర్ట్స్: హరియాణా రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి 30 వరకు జరిగే 35వ జాతీయస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలకు కరీంనగర్ కోతిరాంపూర్‌లోని ప్రభు త్వ ఉన్నత పాఠశాల సవరన్ విద్యార్థిని కీర్తన ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ లింగారావు తెలి పారు. ఇటీవల రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటి జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో కీర్తనను హెచ్‌ఎం సతీశ్, ఉపాధ్యాయులు అభినందించారు.
ధర్మపురి: ధర్మపురి మండలం జైనా సింగిల్ విండో సొసైటీ కార్యదర్శి సాగర్‌రావును సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ పరిధిలోని దమ్మన్నపేట కొనుగోలు కేంద్రాన్ని ఇటీవల అదనపు కలెక్టర్, పౌర సరఫరాల అధికారి సందర్శించారు. ఆ సమయంలో రైస్‌మిల్లులకు ధాన్యం తరలించే విషయమై కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ఘటనలో నిర్వాహకుడిని ఇప్పటికే తొలగించారు. తాజాగా సొసైటీ కార్యదర్శి సాగర్‌రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గుప్త నిధుల పేరిట మోసం
కోనరావుపేట(వేములవాడ): ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయంటూ, వెలికి తీయాలని రూ.4లక్షలు వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ప్రశాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన దుగ్గు వేణు ఇంట్లో బంగారు నిధులు ఉన్నాయని సిరిసిల్ల శివారులోని పెద్దూరుకు చెందిన మేకల నరేశ్, కడవంచ ప్రసాద్, సదుల దేవేందర్, సదుల రాజేశం నమ్మబలికారు. వాటిని బయటకు తీయాలంటే ఖర్చు అవుతుందని నమ్మబలుకుతూ పలుమార్లు కలిపి రూ.4.08లక్షల వరకు వసూలు చేశారు. తర్వాత ముఖం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు కోనరావుపేట పోలీసులను మంగళవారం ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు చేశారు.
చెరుకు తోట దగ్ధం
బోయినపల్లి(చొప్పదండి): వరికొయ్యలు కాలు స్తున్న క్రమంలో మంటలు వ్యాపించడంతో రాజన్నసిరిసిల్ల బోయినపల్లి మండలం స్తంభంపల్లికి చెందిన పులి లక్ష్మీపతికి చెందిన ఆరు ఎకరాల చెరుకుతోట దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాలు. ఆరు ఎకరాల మేర చెరుకు తోట కోతకు వచ్చింది. సమీప పొలంలో వరికొయ్యలు కాల్చడంతో మంటలు చెరుకుతోటలోకి వ్యాపించాయి. ఆరు ఎకరాల మేర చెరుకుపంట కాలిపోయింది. స్థానికులు ఫైరింజన్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చే వరకే మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోయింది. తనకు రూ.7లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు రోదిస్తూ తెలిపాడు.
‘ఓలా’ షోరూం ఎదుట ఆందోళన
జగిత్యాలటౌన్: వాహన చట్టం ప్రకారం సర్వీస్ అందించని ఓలా కంపనీ అనుమతులు రద్దు చేయాలంటూ వినియోగదారులు జగిత్యాలలోని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూం ఎదుట ఆందోళనకు దిగారు. వివిధ ప్రాంతాల నుంచి మంగళవారం షోరూంకు వచ్చిన కస్టమర్లు వాహన సర్వీస్ ఆలస్యంపై నిర్వాహుకులను నిలదీశారు. కంపెనీ నుంచి విడిభాగాలు సరఫరా కావడం లేదని వారు చెప్పడంతో ఆగ్రహంతో షోరూంషెట్టర్లు మూసి తాళం వేసి నిరసన తెలిపారు. నాలుగు నెలలుగా వాహనాలు మరమ్మతు చేయడం లేదని, షోరూంలో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ కబడ్డీ పోటీలకు కీర్తన


