
పట్టాలిచ్చి ఆదుకోండి
మాది వెల్గటూర్ మండలం చెగ్యాం. గ్రామ శివారులోని సర్వే నంబర్ 289, 341, 344లోని 54.23 ఎకరాల భూమిని 175మందిమి 15ళ్లుగా కాస్తు చేసుకుంటున్నాం. ఆ భూమికి పట్టా ఇప్పించాలని అర్జీ పెట్టుకున్నాం. అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే పూర్తిచేసిన తహసీల్దార్ పెండింగ్‌లో పెట్టారు. సర్వే నివేదిక ప్రకారం ఆ భూమికి అసైన్డ్ పట్టాలు ఇప్పించి ఆదుకోండి. – చెగ్యాం గ్రామస్తులు, వెల్గటూర్
సెల్‌టవర్ నిలిపేయండి
మాకు ఎలాంటి సమాచార ఇవ్వకుండా జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మిస్తున్నారు. రేడియషన్‌తో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. టవర్ నిర్మాణం ఆపాలని పలుసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టలేదు. టవర్‌తోపాటు టైర్ గ్రూపింగ్ పరిశ్రమను జనావాసాల దూరంగా తరలించండి.
– భాగ్యనగర్ కాలనీవాసులు

పట్టాలిచ్చి ఆదుకోండి