పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం

Aug 18 2025 6:09 AM | Updated on Aug 18 2025 6:09 AM

పేదల

పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం

పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం కాంగ్రెస్‌ పాలనలో విసుగెత్తుతున్న ప్రజలు

జగిత్యాలరూరల్‌: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం తిమ్మాపూర్‌, గుట్రాజ్‌పల్లి, అనంతారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. సంగంపల్లి, సోమన్‌పల్లి, అనంతారం, గుట్రాజ్‌పల్లి, తిమ్మాపూర్‌, ధర్మారంలో సీసీ రోడ్లకు భూమిపూజ చేశారు. డీఈఓ రాములు, తహసీల్దార్‌ అరుణ్‌కుమార్‌, ఎంపీడీవో రమాదేవి, ఎంఈఓ గాయత్రి, ఏఈ రాజమల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.

వరదకాలువకు నీటి విడుదల

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరదకాలువకు 10వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 1,51,806 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 66.233 టీఎంసీల నీటినిల్వ ఉంది. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటున్నందున పూర్తిస్థాయిలో నిండితే ఏ సమయంలోనైనా గోదావరిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సారెస్పీ ఎస్‌ఇ శ్రీనివాస్‌రావు గుప్తా తెలిపారు.

జగిత్యాలరూరల్‌: ఆరుగ్యారంటీలు అంటూ కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. అదివారం జగిత్యాలరూరల్‌ మండలం లక్ష్మిపూర్‌లో రైతులతో కలిసి మాట్లాడారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేయడంలో విఫలం కావడంతో ఇప్పుడు మాట మారుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచారన్న చర్చ సాగుతోందని పేర్కొన్నారు. 20నెలల కాలంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదన్నారు. తులం బంగారం ఊసేలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆనందరావు, లక్ష్మన్‌, హరీష్‌, నరేశ్‌ పాల్గొన్నారు.

జేఎన్టీయూలో నేడు ఓరియంటేషన్‌ డే

కొడిమ్యాల: మండలంలోని జేఎన్టీయూ (నాచుపల్లి)లో సోమవారం ఓరియంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.విశ్వనాథరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్టియర్‌ విద్యార్థులకు ఆయా బ్రాంచ్‌ల హెచ్‌వోడీలు విద్యావిధానం, సదుపాయాలు, పరిశోధన అవకాశాలపై అవగాహన కల్పిస్తారని, ముఖ్య అతిథిగా ఎస్పీ అశోక్‌కుమార్‌ హాజరవుతున్నారని తెలిపారు. వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాస్‌, ఫస్టియర్‌ క్లాస్‌ రివ్యూ కమిటీ చైర్మన్‌ సురేష్‌ శ్రీపాద రానున్నారని తెలిపారు. వైస్‌ ఛాన్స్‌లర్‌ టి.కిషన్‌కుమార్‌రెడ్డి, కె.విజయ్‌కుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌? కె.వెంకటేశ్వరరావు వర్చువల్‌గా మాట్లాడుతారని వివరించారు.

పేదల సొంతింటి కల   నిజం చేస్తున్నాం1
1/2

పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం

పేదల సొంతింటి కల   నిజం చేస్తున్నాం2
2/2

పేదల సొంతింటి కల నిజం చేస్తున్నాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement