
మారుమోగిన హరినామం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ శివారు రాధాగోవర్ధన ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంకీర్తనలు, అభిషేకాలు, ప్రవచనాలు, మహాహారతి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ నిర్వాహకులు నరహరిప్రభూజీ శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం, భగవంతుడి ప్రకటన ఉద్దేశం, ప్రవచనాలు ఇచ్చారు. ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావ మహోత్సవం, శ్రీకృష్ణ జన్మాష్టమి నందోత్సవం చేపట్టారు.

మారుమోగిన హరినామం

మారుమోగిన హరినామం