
ఎస్సీరెస్పీకి భారీగా వరద
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో 1.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. నీటి నిల్వ 53.62 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నుంచి 4,952 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గో దావరిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.
ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి
కోరుట్ల: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని తాళ్లచెరువు, మద్దుల చెరువు కిందగల లోతట్టు ప్రాంతాలను శనివారం పరిశీలించారు. చెరువు వైపు ప్రజలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయించారు. మురికి కాలువలను శుభ్రం చేయించి వరద నీరు సక్రమంగా వెళ్లేలా చూశారు. కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండే ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సీహెచ్ రాజేంద్ర ప్రసాద్ (శానిటరీ ఇన్స్‌క్టర్)ను సెల్ 99495 65606లో.. బి.అశోక్ (ఇన్‌చార్జి శానిటరీ ఇన్స్‌పెక్టర్)ను సెల్ 98499 07961 నంబర్లకు ఉద యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశామని 91000 39255కు ఫోన్ చేయవచ్చని వివరించారు.
30.9 మిల్లీమీటర్ల వర్షపాతం
జగిత్యాలఅగ్రికల్చర్: శనివారం ఉదయం వర కు జిల్లాలో సగటున 30.9 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదైంది. అత్యధికంగా సారంగాపూర్ మండలంలో 116.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంఇ. అత్యల్పంగా గొల్లపల్లిలో 5.2 మి.మీగా నమోదైంది. ఇబ్రహీంపట్నంలో 39.2, మల్లాపూర్‌లో 47.6, రాయికల్‌లో 62.8, బీర్‌పూర్‌లో 40.2, ధర్మపురిలో 54.9, బుగ్గారంలో 31, జగిత్యాల రూరల్‌లో 18.1, జగిత్యాల అర్బన్‌లో 19.9, మేడిపల్లిలో 23.7, కోరుట్లలో 30.2, మెట్‌పల్లిలో 16, కథలాపూర్‌లో 16.8, కొడిమ్యాలలో 14.8, మల్యాలలో 9.4, పెగడపల్లిలో 11.4, వెల్గటూర్‌లో 27.7, ఎండపల్లిలో 21.8, భీమారంలో 11 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అభివృద్ధి దిశగా గాయత్రి బ్యాంకు
జగిత్యాల: రూ.342 8.46 కోట్లతో.. 66 శాఖలతో గాయత్రి బ్యాంకు అభివృద్ధి పథంలో నడుస్తోందని సీఈవో వనమాల శ్రీనివాస్ అన్నారు. శనివారం నిర్వహించిన బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. 25ఏళ్లలో 7.88లక్షల వినియోగదారులను కలిగి రూ.34 28.46 కోట్ల వ్యాపారంతో మల్టీ స్టేట్ కో–ఆపరేటీవ్ బ్యాంక్‌గా అవతరించిందన్నారు. త్వరలో 15 బ్రాంచ్‌లను ప్రారంభించేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్, ఐఎంపీఎస్ వంటి సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ప్రమాద బీమా సౌకర్యం ఉందన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఖాతాదారుడు కుటుంబానికి రూ.లక్ష చెక్కు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రవికుమార్, డైరెక్టర్లు మల్లేశం, ప్రసాద్, వాసాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించండి
జగిత్యాల: ఓటర్ల జాబితా పారదర్శకంగా రూ పొందించాలని, ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా చూడాలని రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఆర్టికల్‌లో పొందుపర్చింద ని మాజీమంత్రి జీవన్‌రెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు శనివారం లేఖ రాశారు. ఆధార్‌కార్డును ఓటరు జాబితాకు లింక్ చేస్తూ వేర్వేరు ప్రాంతాల్లో రెండు ఓట్లు కలిగిన వ్యక్తులను గుర్తించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న వారు ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వీటిని నిరోధించేలా చూడాలని కోరారు.

ఎస్సీరెస్పీకి భారీగా వరద

ఎస్సీరెస్పీకి భారీగా వరద