
పెరిగిన గోదావరి ఉధృతి
ధర్మపురి/సారంగాపూర్/ఇబ్రహీంపట్నం/జగిత్యాల క్రైం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో గోదావరి ఉధృతి పెరిగింది. ధర్మపురి వద్ద సంతోషిమాత, మంగలిగడ్డ పుష్కరఘాట్లు నీటిలో మునిగి పోయాయి. కలెక్టర్ సత్యప్రసాద్ గోదావ రి తీర ప్రాంతాలను పరిశీలించారు. మున్సిపల్, రెవెన్యూ, మండల పరిషత్, పోలీస్‌శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాయపట్నం వద్ద లో లెవల్ వంతెన, ఆకసాయిపల్లె గుట్ట వద్ద లోలెవల్ వంతెలనలు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఎంపీడీవో రవీందర్, సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్ ఉన్నారు.
కమ్మునూర్ వద్ద..
బీర్పూర్ మండలం కమ్మునూర్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంపీడీవో భీమేశ్, ఎస్సై రాజు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు గోదావరి వైపు వెళ్లవద్దని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. భారీవర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోందని ఈఈ చక్రపాణి శనివారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి ఎప్పుడైనా నీరు విడుదల చేసే అవకాశం ఉన్నందున ప్రజలు, గొర్రెలకాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సారంగాపూర్ మండలంలోని గంగమ్మ చెరువు ఉప్పొంగడంతో రేచపల్లి – భీంరెడ్డిగూడం గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కానిస్టేబుల్‌ను నియమించాలని, భారీకేడ్లు ఏర్పా టు చేయాలన్నారు. సెల్ఫీ దిగడానికి ఎవరైనా వస్తే వెనక్కి పంపించాలని సూచించారు. ఆర్డీవో మదుసూధన్, తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై గీత ఉన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. శనివా రం గోదావరి పరీవాహక ప్రాంతాలు, చెరువులు, వాగులు, వంతెనలు, ప్రధాన రహదారులను సందర్శించారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు 100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

పెరిగిన గోదావరి ఉధృతి

పెరిగిన గోదావరి ఉధృతి