
విశేష సేవలకు ప్రతిష్టాత్మక పతకాలు
జగిత్యాలక్రైం: పోలీసు శాఖలో విశేష సేవలందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పతకాలను శుక్రవారం ఎస్పీ అశోక్‌కుమార్ అందజేశారు. సారంగాపూర్ హెడ్‌కానిస్టేబుళ్లు రాములు, అహ్మద్ మొయినొద్దీన్, డీఎస్బీ హెడ్‌కాని స్టేబుళ్లు ఉపేందర్‌రాజు, శంకరయ్య, ఏఆర్ ఎస్సైలు శ్రీనివాస్, సయ్యద్ తఖియోద్దీన్, ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు పోచయ్య, మోహన్‌లాల్, నాగన్న, మల్లారెడ్డి, నసిమోద్దీన్, మెట్‌పల్లి ఏఎస్సైలు ఎండీ జమీల్, నర్సింహారెడ్డి, కథలాపూర్ ఏఎస్సై బిక్షపతి, కోరుట్ల ఏఎస్సై సత్తయ్య, మల్యాల హెడ్‌కానిస్టేబుళ్లు మల్లారెడ్డి, రవి, కథలాపూర్ హెడ్‌కానిస్టేబుళ్లు నీలానాయక్, శ్రీనివాస్, మేడిపల్లి హెడ్‌కానిస్టేబుల్ ఎండీ ఇలియాస్‌అహ్మద్, గొల్లపల్లి హెడ్‌కానిస్టేబుల్ రాజమౌళి, ఇబ్రహీంపట్నం హెడ్‌కానిస్టేబుల్ తనోబ, మెట్‌పల్లి హెడ్‌కానిస్టేబుల్ ప్రకాశ్ సేవా పతకాలు స్వీకరించారు. ఏఆర్ ఎస్సై రామస్వామి, మేడిపల్లి హెడ్‌కానిస్టేబుల్ ఎ.శ్రీనివాస్ ఉత్తమ సేవా పతకాలు అందుకున్నారు.