
త్యాగధనులతోనే దేశానికి స్వేచ్ఛ
జగిత్యాలక్రైం: ఎంతో మంది త్యాగధనులతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ దేశసేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతిస్థాపనకు కృషి చేయాలన్నారు. మహానుభావుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. ఎస్బీ డీఎస్పీ వెంకటరమణ, సైబర్‌క్రైం డీఎస్పీ వెంకటరమణ, మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐలు శ్రీనివాస్, ఆరీఫ్‌అలీఖాన్, రఫీక్‌ఖాన్, శ్రీధర్, రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, సైదులు, డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.