
కలెక్టర్ పతాకావిష్కరణ
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్యాంపు, జెడ్పీ కార్యాలయాల్లో కలెక్టర్ సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం చిన్నారులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఇందిరాభవన్‌లో మంత్రి లక్ష్మణ్‌కుమార్, మోతె రోడ్డులో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, బీజేపీ కార్యాలయం కమలా నిలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, టవర్ వద్ద నిత్యజనగణమన మిత్రబృందం ప్రతినిధులు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో ఎస్పీ అశోక్‌కుమార్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లత, డీఎస్పీ రఘుచందర్, ఆర్డీవో మధుసూదన్, వివిధ శాఖ ల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.