జగిత్యాలక్రైం: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రి ఉత్సవా లను జరుపుకోవాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శబ్దకాలుష్యం కలిగించే డీజేలు, భారీ సౌండ్ సిస్టమ్స్ నిషేధించామన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు వేడుకలను ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని తెలిపారు.
సామాజిక మాద్యమాల్లో వచ్చే వదంతులను నమ్మకూడదని పేర్కొన్నారు. సందేహాలుంటే పోలీసు వారికి లేదా 100 డయల్ ద్వారా సమాచారం అందించాలన్నారు.