
పనులకు ఆటంకం కలిగించొద్దు
జగిత్యాల: అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొ ద్దని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపక్షాలను కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రూ.1.30 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటికీ మంజూరు కాని నిధులు తెచ్చానని, పనులను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని తెలి పారు. 40 ఇళ్లు కట్టని నాయకులు ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి 4,500 ఇళ్లలో వసతులపై మా ట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మున్సిపల్ సిబ్బంది తడి, పొడి చెత్త వేరుగా చేయాలన్నారు. డంపింగ్‌యార్డు ప్రహరీకి రూ.2కోట్లు, చెత్తశుద్ధికి ఇప్పటికే రూ.5 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వివరించారు.