
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
జగిత్యాలటౌన్:స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. హర్‌ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణరావు, కన్నం అంజయ్య, కృష్ణహరి, మ్యాదరి అశోక్, పాత రమేష్, తిరుపతి, గడ్డల లక్ష్మి, చెన్నాడి మధురిమ, పద్మ తదితరులు ఉన్నారు.
16న పెద్దగుట్ట నృసింహునికి వరదపాశం
సారంగాపూర్: బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం శ్రీపెద్దగుట్ట నృసింహస్వామికి ఈనెల 16న వరదపాశం సమర్పించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్దసంతోష్, అర్చకులు చిన్న సంతోష్, మధుకుమార్ తెలిపారు. ఉదయం ఆలయం సమీపం నుంచి ఉదయం 7 గంటలకు కాలినడకన పెద్ద గుట్టపైకి చేరుకుని వరదపాశాన్ని కిందకు జారవిడుస్తారు.