
పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలి
● సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్
రాయికల్: పద్మశాలీలు అన్ని రంగాల్లో ముందుండాలని సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని మార్కండేయ మందిరంలో పద్మశాలీ సేవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న బోగ రాజేశం, ఉపాధ్యక్షుడు దాసరి గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల నరేశ్, కోశాధికారిగా ఆడెపు నర్సయ్య ప్రమాణస్వీకారం చేశారు. ప్రతి గ్రామంలో పద్మశాలిల సామాజిక వర్గమే ఎక్కువగా ఉందని, సామాజిక, రాజకీయ సేవ రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. పద్మశాలీల ఓటు బ్యాంక్‌తోనే రాజకీయాలు తారుమారవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శి జక్కుల చంద్రశేఖర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, యువజన అధ్యక్షుడు సామల్ల సతీశ్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, నాయకులు తాటిపాముల విశ్వనాథం, దాసరి రామస్వామి, రాజ్‌కిశోర్, పోపా సంఘం నాయకులు పాల్గొన్నారు.