
జీవనదిగా వరదకాలువ
కథలాపూర్: వరదకాలువ ప్రస్తుతం జీవనదిగా మారిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మండలంలోని దుంపేట శివారు వరదకాలువను బుధవారం పరిశీలించారు. వరదకాలువ తవ్వుతున్న సమయంలో టీడీపీ, టీఆర్‌ఎస్ నాయకులు నిరాశపరిచారని, అదే కాలువ ఇప్పుడు జీవనదిగా మారిందని పేర్కొన్నారు. కొంతమంది రైతు ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాళ్లవాగు, సూరమ్మ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ నరేశ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్