
నేడు జగిత్యాలకు మంత్రి పొన్నం
జగిత్యాలటౌన్: రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధశారం జగిత్యాలకు రానున్నారు. ఉదయం 9గంటలకు గొల్లపల్లి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి సోదరుడి కూతురి వివాహానికి హాజరవుతారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
పోగొట్టుకున్న 1268 సెల్‌ఫోన్లు అందజేత
జగిత్యాలక్రైం: జిల్లా పరిధిలో పోగొట్టుకున్న.. చోరీకి గురైన 1268 సెల్‌ఫోన్లను ఎస్పీ అశోక్ కుమార్ తన కార్యాలయంలో బాధితులకు మంగళవారం అందించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా నమోదు చేసుకుంటే ఫోన్‌ను గుర్తించవచ్చని ఎస్పీ అన్నారు. సీఈఐఆర్‌లో వినియోగదారులు తమ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్‌ఫోన్‌ను ఈపోర్టల్ ద్వారా గుర్తించవచ్చన్నారు. సెల్‌ఫోన్ రికవరీకి ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీంను నియమించామని తెలిపారు. ఐటీకోర్ ఇన్‌స్పెక్టర్ రఫీక్‌ఖాన్, సీఈఆర్‌ఐ హెడ్‌కానిస్టేబుల్ మహమూద్, కానిస్టేబుళ్లు అజర్, ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకు మోస్తరు వర్ష సూచన
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రానున్న ఐదురోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శాస్త్రవేత్త బి. శ్రీలక్ష్మి తెలిపారు. శుక్రవారం వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 30 డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.
రాజగంగారాం సమస్యపై ఆర్డీవో విచారణ
మల్లాపూర్: మండలంలోని ముత్యంపేటలో మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్ విచారణ చేపట్టారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు మర్రిపెల్లి రాజగంగరాంను అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్, ఇతర సిబ్బంది ఈడ్చుకెళ్లిన విషయం తెల్సిందే. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాస్ ముత్యంపేటలో విచారణ చేపట్టారు. రాజగంగరాం సమస్యపై ఇరువర్గాలు, గ్రామస్తుల వాదనలు తెలుసుకున్నానని, నివేదికను కలెక్టర్‌కు అందిస్తానని తెలిపారు. ఆయ న వెంట తహసీల్దార్ రమేష్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, ఎంపీవో జగదీశ్, ఆర్‌ఐ రాజేశ్, పంచాయతీ కార్యదర్శి ముబిన్ ఉన్నారు.
మంటల అదుపునకు రంగంలోకి ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం
మెట్‌పల్లి: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ప్రమాదం జరిగి 60 గంటలు దాటినా మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఉన్నతాధికారులు ఎస్‌డీఆర్‌ఎఫ్ (రాష్ట్ర విపత్తు స్పందన దళం)ను రంగంలోకి దింపారు. రెండు రోజులుగా గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న అగ్ని మాపక సిబ్బంది అలసిపోవడం, మంటలు తగ్గకపోవడంతో మంగళవారం రాత్రి తొమ్మిది మందితో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ప్రమాద స్థలానికి పంపారు. వారు బుధవారం ఉదయం వరకు మంటలను పూర్తిగా అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తారని అధికారులు తెలిపారు. గోదాం వద్ద కరెంట్ సదుపాయం లేకపోవడం, జనరేటర్ ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి కొద్దిసేపు పనులకు అంతరాయం కలిగింది. తర్వాత జనరేటర్‌ను తెప్పించడంతో తిరిగి పనులను కొనసాగించారు.

నేడు జగిత్యాలకు మంత్రి పొన్నం

నేడు జగిత్యాలకు మంత్రి పొన్నం