
గడువులోపు ఇందిరమ్మ ఇళ్లు పూర్తిచేయాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
కథలాపూర్: గడువులోపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మండలంలోని భూషణరావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంగళవారం పరిశీలించారు. పీఏసీఎస్‌ను తనిఖీ చేసి యూరియా నిల్వలపై అడిగి తెలుసుకున్నారు. జెడ్పీ హైస్కూల్‌లో పాఠాలు విన్నారు. సిరికొండ పీఏసీఎస్ తనిఖీ చేశారు. మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యేలా చూడాలన్నారు. యూరియా విక్రయిస్తే కచ్చితంగా రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్ ఉన్నారు.
ఎరువుల నిల్వలు తనిఖీ
మేడిపల్లి: మండలకేంద్రంలోని పీఏసీఎస్ గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎకరానికి ఒక యూరియా బస్తా మాత్రమే రైతులకు ఇవ్వాలని ఆదేశించారు. తహసీల్దార్ మునిందర్, ఎంపీడీవో పద్మజ, ఏవో షాహిద్ అలీ ఉన్నారు.