
గోదాంను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్
మెట్‌పల్లి: అగ్ని ప్రమాదం సంభవించిన పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంను మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తినష్టం వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. గోదాం పక్కనే ఇళ్లు ఉన్నందున వారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంటలను అదుపు చేయడానికి కృషి చేస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్దన్, ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్, ఫైర్ ఆఫీసర్ సైదులు, తహసీల్దార్ వరస్రసాద్, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి ఉన్నారు.
విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
కోరుట్ల రూరల్: విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. వెటర్నరీ సైన్స్ కళాశాలలో యువజన దినోత్సవం, యాంటీ ర్యాగింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ర్యాగింగ్‌తో విద్యార్థులు తమ కెరీర్‌ను పాడు చేసుకుంటున్నారని తెలిపారు. వాదప్రతివాదం, క్విజ్, పోస్టర్ మేకింగ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్‌లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కళాశాల అసోసియేట్ డీన్ డి.శ్రీనివాస్, ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు పాల్గొన్నారు.