
సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.30కోట్లు మంజూరు
● ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం
మెట్‌పల్లి: రేగుంటలో సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.30కోట్లు మంజూరైనట్లు ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం తెలిపారు. సబ్‌స్టేషన్ కోసం కేటాయించిన స్థలాన్ని మంగళవారం ఆయన స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలో ఇప్పటికే రెండు సబ్‌స్టేషన్లు ఉన్నాయ ని, వాటి ద్వారా 24వేల మంది వినియోగదారులకు విద్యుత్ అందిస్తున్నామని, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో సబ్‌స్టేషన్‌ను నిర్మించాలని నిర్ణయించామన్నారు. టెండర్ పూర్తయిందని, పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. డీఈ మధుసూదన్, ఏడీఈలు మనోహర్, రాజబ్రహ్మచారి, ఏఈ రవి ఉన్నారు.
అమ్మక్కపేట సబ్‌స్టేషన్‌కు అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్
ఇబ్రహీంపట్నం: మండలంలోని అమ్మక్కపేట సబ్‌స్టేషన్‌కు రూ.85 లక్షలతో 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫర్ మంజురు చేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. ఈనెల 18లోగా పనులు పూర్తిచేస్తామన్నారు. ఏఈ రవి, సబ్ ఇంజినీర్ చావన్, ఇందల్ లైన్‌మన్ రాము, కంట్రాక్టర్ లింగం పాల్గొన్నారు.