
రామన్నపేట పరిధి చూపండి
మాది మల్యాల మండలం రామన్నపేట. ప్రొసీడింగ్ నంబర్ 470/78 ఈల్‌సీఈ ఏ5 తేదీ 15–10–1978 నాటి కలెక్టర్ ఉత్తర్వుల ద్వారా నూకపల్లి నుంచి వీడి ప్రత్యేక గ్రామపంచాయతీగా అయ్యింది. రామన్నపేట పంచాయతీ నుంచి అనుమతి పొంది నిర్మించుకున్న ఇళ్లు, దుకాణాలు నూకపెల్లి పరిధిలోకే వస్తాయంటూ కొందరు బెదిరిస్తున్నారు. ఇది శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మా గ్రామానికి గతంలో కేటాయించిన సర్వేనంబర్ల ప్రతిని అందించి ఇరుగ్రామాల మధ్య గొడవలకు ఆస్కారం లేకుండా చూడండి.
– రామన్నపేట గ్రామస్తులు