
యూరియాపై ఆందోళన వద్దు– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార
జగిత్యాల: యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని, సరిపడా స్టాక్ ఉందని, ఆధార్‌కార్డు ద్వారా సరఫరా చేస్తున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. యూరియా ముడిసరుకు ఆలస్యం కారణంగా కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎళ్లవేళలా రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. జగిత్యాలకు వచ్చిన ఆయనను టీఎన్జీవో నాయకులు కలిశారు. పెండింగ్ బిల్లుల మంజూరు, ఉద్యోగుల హెల్త్‌స్కీం అమలు, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ మంజూరు చేయాలని, పీఆర్సీ అమలు వంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగేందర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, నాయకులు మహబూబ్, రాజేందర్, రవికుమార్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుడికి మంత్రి పరామర్శ
కొడిమ్యాల: కాంగ్రెస్ నాయకుడు, ప్యాక్స్ చైర్మన్ రాజనర్సింగరావును మంత్రి పరామర్శించారు. ఆయన తల్లి ప్రేమలత (70) హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పరామర్శించారు.