సమస్యల పరిష్కారానికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు

Aug 12 2025 7:49 AM | Updated on Aug 13 2025 4:52 AM

సమస్య

సమస్యల పరిష్కారానికి చర్యలు

● ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల తాకిడి ● వాతావరణ మార్పులతో వ్యాధులు ● వరండాలోనే వైద్యమందిస్తున్న వైద్యులు

జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్‌ నిర్వహించారు. 15 మంది వివిధ సమస్యలపై దరఖాస్తుల చేసుకున్నారు. ఎస్పీ వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

వరదకాలువకు నీటి నిలిపివేత

జగిత్యాలఅగ్రికల్చర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరదకాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. ఉన్నతాధికారుల అదేశాల మేరకు సోమవారం గేట్లను కిందకు దించారు. ఈనెల ఏడో తేదీ నుంచి వరదకాలువకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున సాగు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 19,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 44.49 టీఎంసీలుగా ఉంది. కాకతీయ కాలువకు 3500 క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 800, లక్ష్మి కాలువకు 150, అలీ సాగర్‌, గుత్పా ఎత్తిపోతలకు 495, మిషన్‌ భగరీథకు 231 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు.

పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి

జగిత్యాల: పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు తప్పనిసరిగా వేయాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ అన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మైనార్టీ గురుకులంలో మాత్రలు పంపిణీ చేశారు. నులిపురుగులు, కొంకి పురుగులు, ఎలికపాములు అభివృద్ధి చెంది అనారోగ్యానికి గురవుతారని, మాత్రలు వేసుకుంటూ అవన్నీ నశించిపోతాయని పేర్కొన్నారు. పోషకాహార లోపం, తీవ్రమైన అలసట, చదువుపై ధ్యాస ఉండదన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ చిత్రనాయక్‌, కట్కం భూమేశ్వర్‌, ప్రిన్సిపల్‌ సుచరిత పాల్గొన్నారు.

తహసీల్దార్ల బదిలీలు

జిల్లాలోని పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల రూరల్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను ధర్మపురికి, నాయబ్‌ తహసీల్దార్‌ అరుణ్‌కుమార్‌కు ఫుల్‌ అడిషనల్‌ చార్జి తహసీల్దార్‌గా నియమించారు. బుగ్గారం తహసీల్దార్‌ మహ్మద్‌ అబ్దుల్‌ మాజీద్‌ను గొల్లపల్లికి, జగిత్యాల అర్బన్‌ నాయబ్‌ తహసీల్దార్‌ ఎల్‌.తిరుపతిని బుగ్గారం ఫుల్‌ అడిషనల్‌ చార్జి తహసీల్దార్‌గా, గొల్లపల్లి తహసీల్దార్‌ వరందన్‌ను కలెక్టరేట్‌లో రిపోర్ట్‌ చేయాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

రాజన్న శరణు.. శరణు

సారంగాపూర్‌: శ్రావణ సోమవారం కావడంతో దుబ్బరాజన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కోడెమొక్కులు, గజశూలం, గండదీపం, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు. స్వామివారికి అర్చన, అభిషేకాలు చేశారు. ఆలయ ఈవో అనూష, వ్యవస్థాపక ధర్మకర్త పొరండ్ల శంకరయ్య, ఆలయ సిబ్బంది భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు1
1/3

సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు2
2/3

సమస్యల పరిష్కారానికి చర్యలు

సమస్యల పరిష్కారానికి చర్యలు3
3/3

సమస్యల పరిష్కారానికి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement