
‘డబుల్‌బెడ్‌రూం’ ఇళ్లలో వసతులు కల్పించాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
జగిత్యాల: నూకపల్లి అర్బన్ హౌసింగ్‌కాలనీలో డబుల్ బెడ్రూం ఇళ్లవద్ద వసతులు కల్పించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అన్నారు. సోమవారం కాలనీలో పర్యటించారు. దోమలు వ్యాపిస్తున్నాయని, పాములు, తేళ్లు తిరుగుతున్నాయని, వీధిదీపాలు వెలగడం లేదని, మురుగుకాలువలు లేవని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని జగిత్యాల బల్దియా కమిషనర్ స్పందనకు ఫోన్ చేసి ఆదేశించారు. కాలనీలో ఇళ్లు తొలగించిన వారికి తిరిగి ఇళ్లు కేటాయించాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులు కొందరు ఆర్థిక స్థోమత లేక ఆలస్యం చేస్తున్నారని, ఇప్పటి ప్రభుత్వం వాటిని కూల్చివేసిందని, ఆ బాధితులకు తిరిగా ఇళ్లు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ కౌన్సిలర్ దేవేందర్‌నాయక్, శివకేసరిబాబు పాల్గొన్నారు.