
పేదల సొంతింటి కల నెరవేర్చిన ఇందిరమ్మ పథకం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కథలాపూర్(వేములవాడ): ఇళ్లులేని పేదలకు సొంతింటి కల నెరవేర్చాలని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని కలిగోట, పోతారం గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. రెండు గ్రామాల్లో 19 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, మిగతా లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని, నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరై పనులు జరుగుతున్నాయన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పులి శిరీషా, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు తొట్ల అంజయ్య, ఎండీ అజీమ్, కల్లెడ గంగాధర్, హరిప్రసాద్, మ్యాదరవేని రాజు, రాధాకృష్ణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.