
నియంత్రణ చర్యలు అంతంతే..
● అధికారులు తీసుకుంటున్న చర్యల వల్ల ఇప్పట్లో కుక్కల నియంత్రణ సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
● కుక్కలను బర్త్ కంట్రోల్ సెంటర్‌కు తరలించి చికిత్స చేసిన అనంతరం తిరిగి వాటిని పట్టుకున్న ప్రదేశాల్లోనే వదిలిపెడుతున్నారు.
● దీంతో ప్రస్తుతం వీధుల్లో వాటి బెడద తొలగిపోయే అవకాశం మాత్రం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.
● పెరిగిపోతున్న కుక్కల బెడద వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.
● ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కేవలం కుక్కల సంతానోత్పత్తిని తగ్గించడానికి మాత్రమే పరిమితం కాకుండా వాటిని నియంత్రించే చర్యలపైనా కూడా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.