
అటవీభూములను కాపాడాలి
చెట్లను కాపాడడం అందరి బాధ్యతగా భావించాలి. అటవీ భూములు పచ్చని చెట్లతో కళకళలాడాలి. అవి అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు పట్టించుకోకపోవడం సరికాదు. ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆర్భాటంగా నిర్వహిస్తున్నపటికీ చెట్లను నరికివేసే వారిపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. ఇప్పటికై నా అధికారులు అటవీభూములను కాపాడాలి.
– తాలుకా మల్లేశ్, పౌర మానవహక్కుల సంస్థ ప్రతినిధి, కథలాపూర్
చర్యలు తీసుకుంటాం
అటవీభూముల్లోని చెట్లను తొలగించడం నేరం. అటవీశాఖ భూముల్లో చెట్లను తొలగిస్తే ప్రజలు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలి. చెప్పినవారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. అటవీభూములను చదును చేసి అక్రమించుకొని పంటలు సాగుచేస్తే వాటిని పరిశీలించి శాఖాపరంగా చర్యలు తీసుకుంటాం. బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం.
– ఎండీ ముస్తాక్ ఆలీ, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్, కథలాపూర్