
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
కోరుట్ల: రాజ్యాంగ పరిరక్షణ దేశంలోని ప్రతీ పౌరుని బాధ్యత అని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని సినారే కళాభవన్‌లో వామపక్షాలు, పూలే అంబేడ్కర్, మైనార్టీ, ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. నోటు కోసం ఓటును అమ్ముకోవద్దని సూచించారు. మానవ వికాస్ వేదిక రాష్ట్ర కార్యదర్శి డి. హన్మంతరావు మాట్లాడుతూ, రాజ్యాంగం దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించిందని పేర్కొన్నారు. వామపక్షాల నాయకులు చెన్నా విశ్వనాథం, జి.తిరుపతి నా యక్, చింత భూమేశ్వర్, ప్రజా సంఘాల జేఏ సీ రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్, భారత్ బచా వో జిల్లా కార్యదర్శి పి.నారాయణ, లక్ష్మ క్క, పీయూసీఐ భీమయ్య, టీపీజేసీ నాయకుడు పొన్నం రాజమల్లయ్య, వడ్డెర వృత్తి సంఘం జిల్లా కార్యదర్శి కుంచం శంకర్ పాల్గొన్నారు.
బెదిరించినవారిపై చర్యలు తీసుకోవాలి
మల్యాల(చొప్పదండి): మల్యాల మండలం రామన్నపేట శివారులోని నిర్మాణాలకు రామన్నపేట బోర్డు తొలగించాలని సంబంధిత యజమానులను బెదిరిస్తున్నవారిపై చర్యలు తీసుకోవా లని ఆదివారం గ్రామస్తులు సీఐ రవికి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఇటీవల నూతనంగా నిర్మించిన ఫంక్షన్‌హాల్‌కు రామన్నపేట గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకొని బోర్డు ఏర్పాటు చేస్తే అది నూకపల్లి సరిహద్దు అని భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. అలాగే మహామార్ట్, డాక్టర్ వీఆర్‌కే ఇంజినీరింగ్ కళాశాలకుసైతం రామన్నపేట బోర్డు తొలగించాలని హెచ్చరించినవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు పన్నాల మహేందర్‌రెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, గడ్డం మల్లారెడ్డి, నేరెళ్ల సతీశ్, నేరెళ్ల నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డి, ప్రవీణ్, అజారొద్దీన్, వలీ మహమ్మద్, కోరుట్ల మురళి పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంకులో మోగిన సైరన్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గల యూనియన్ బ్యాంకులో ఆదివారం మధ్యాహ్నం సైరన్ మోగింది. దీంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వారు అప్రమత్తమై వెంటనే బ్యాంకు అధికారులను పిలిపించారు. అధికారులు బ్యాంకులో పరిశీలించి సాంకేతిక లోపంతోనే సైరన్ మోగినట్లు నిర్ధారించుకున్నారు. దీంతో, పోలీసులు, బ్యాంకు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని ఆందోళన
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని వివిధ కుల సంఘాల్లో పొదుపు డబ్బులు తీసుకుని చెల్లించడం లేదని గ్రామానికి చెందిన కొంతమంది ఆదివారం డబ్బు తీసుకున్న వ్యక్తి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన సుమారు 15 మంది అదే గ్రామానికి చెందిన ఓ నాయకుడికి రూ.15–20 లక్షలు అవసరం నిమిత్తం పొదుపు డబ్బులు ఇచ్చారు. తిరిగి డబ్బులు చెల్లించాలని అడిగితే, తాను రాజకీయ నాయకుడినని, ‘మీ దమ్మున్న చోట చెప్పుకో’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని నిరసిస్తూ నాయకుడి ఇంటి ఎదుట ఆదివారం ఆందోళన చేశారు. రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత