
జగిత్యాల మున్సిపాల్టీకి అత్యధిక నిధులు
జగిత్యాలటౌన్: రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో జగిత్యాలకు సీఎం రేవంత్‌రెడ్డి అత్యధిక నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 19,26,27వ వార్డుల్లో రూ.50లక్షల నిధులతో చేపట్టే సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభించి మాట్లాడారు. జగిత్యాల మున్సిపాల్టీకి ఇప్పటి వరకు రూ.140 కోట్లు, స్టాంపు డ్యూటీ కింద మరో రూ.10 కోట్లు మంజూరయ్యాయని వివరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో మౌలిక సదుపాయాల కోసం గతంలో రూ.34కోట్లు, ప్రస్తుతం మరో రూ.20 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. రూ.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. అలాగే తాటిపల్లి గ్రామంలో రూ.27 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన, రూ.6 లక్షలతో నిర్మించిన తాగునీటి పైపులైన్‌ను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, తహసీల్దార్ శ్రీనివాస్, డీఈ ములింద్, రామారావు, ఎంపీవో రవిబాబు, నాయకులు దామోదర్‌రావు, ఎల్లారెడ్డి, నక్కల ర వీందర్ రెడ్డి, ముకుందం, శంకర్, అంజన్న, గంగారెడ్డి, మల్లారెడ్డి, మహేశ్వర్‌రావు తదితరులు పాల్గ్గొన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్