
వామ్మో చిరుత
● ధర్మపురి శివారులో సంచారం ● ధ్రువీకరించిన ఫారెస్టు అధికారులు
ధర్మపురి: ధర్మపురి శివారులో చిరుతపులి సంచరించిన ట్లు ఫారెస్టు అధికా రులు ధ్రువీకరించారు. ధర్మపురితో పాటు మండలంలో ని కమలాపూర్, నాగారం, ఆకసాయిపల్లె గ్రామాలకు సమీపంలో గుట్టలతో కూడిన దట్టమై న అడవి ఉంది. శనివారం సాయంత్రం కొందరు రైతులు, వ్యవసాయ కూలీలు పనులు ముగించుకొని వస్తుండగా ధర్మపురి– కమలాపూర్ వెళ్లే దారిలో చిరుతను భయభ్రాంతులకు గురై పరగులు తీశారు. ధర్మపురి నుంచి కమలాపూర్ వెళ్లే దారిలో పెట్రోలుబంకు పక్కనున్న చిన్న రహదారి గుండా నిత్యం వ్యవసాయదారులు పనుల కోసం వెళ్తుంటారు. పనులు ముగించుకొని వస్తుండగా చిరుత కనిపించినట్లు తెలిపారు.
రంగంలోకి ఫారెస్టు అధికారులు
చిరుతపులి సంచరించిన విషయంపై జిల్లా ఫారెస్టు అధికారులకు పలువురు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈక్రమంలో ఆదివారం ధర్మపురి శివారులోని కొన్ని ప్రదేశాలను సంబంధిత అధికారులు పరిశీలించారు. చిరుతపులి సంచరించినట్లు దాని పాదముద్రల ద్వారా గుర్తించారు.
దాడికి పాల్పడవద్దు
ధర్మపురి శివారులో చిరుతపులి సంచరించినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. దానిపై ఎవరూ దాడికి పాల్పడవద్దని సూచించారు. వ్యవసాయ పనులకు గుంపులుగుంపులుగా వెళ్లాలని, సాయంత్రం 4 గంటల వరకు పనులు ముగించుకొని ఇళ్లకు చేరాలని పేర్కొన్నారు. ధర్మపురితో పాటు మండలంలోని కమలాపూర్, రామయ్యపల్లె, నాగారం, ఆకసాయిపల్లె గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వామ్మో చిరుత