మిగిలింది ఐదు రోజులే..! | - | Sakshi
Sakshi News home page

మిగిలింది ఐదు రోజులే..!

Aug 10 2025 6:06 AM | Updated on Aug 10 2025 6:06 AM

మిగిల

మిగిలింది ఐదు రోజులే..!

రాఖీ వేడుక

జగిత్యాల/కోరుట్ల/గొల్లపల్లి: రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరికి పలువురు రాఖీ కట్టారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కి ఆయన సోదరి డాక్టర్‌ సమత రాఖీ కట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ అడువాల జ్యోతి, జీవన్‌రెడ్డికి మాజీ కౌన్సిలర్‌ అనిత రాఖీ కట్టారు.

జగిత్యాల: ‘ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. ఆయా సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15 వరకు దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలి..’ ఇది కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అధికారులకు జారీ చేసిన ఆదేశం. కానీ.. ఆయన ఆదేశాలు క్షేత్రస్థాయంలో గడువులోపు అమలయ్యే అవకాశం కన్పించడం లేదు. ఆయన ఇచ్చిన గడువుకు ఇంకా మిగిలింది ఐదు రోజులు మాత్రమే. ఆ లోపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 24,420 దరఖాస్తులు వచ్చాయి. అందులో 24,387 దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేశారు. 21,591 మందికి నోటీసులు జారీ చేశారు. ఇందులో కేవలం 910 మాత్రమే పరిష్కారం అయ్యాయి. 434 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. ఈ ఆగస్టు 15లోపు సమస్యలన్నిటినీ పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినా కొన్ని ఇబ్బందులతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద బుగ్గారం మండలాన్ని ఎన్నుకుని అందులో దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించారు. జూన్‌ 3 నుంచి 20వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో అత్యధికంగా మిస్సింగ్‌ సర్వేనంబర్లు రాగా, సాదాబైనామాలే 8,667 వచ్చాయి. మిస్సింగ్‌ సర్వేనంబర్లు 4,237 వచ్చాయి. వచ్చిన దరఖాస్తులన్నింటిని అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారుగానీ.. సమస్య పరిష్కరించాలంటే కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా సాదాబైనామాలపైనే దరఖాస్తులు వచ్చాయి. గత ప్రభుత్వం 2జూన్‌ 2014కు ముందు సాదాబైనామాల ద్వారా భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంది. కొన్నాళ్లకు సాదాబైనామాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్రస్తుతం అలాంటి వాటిపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సాదాబైనామా దరఖాస్తులు పరిశీలించి క్రమద్ధీకరించాలని రైతులు కోరుతున్నారు.

గడువులోపు కష్టమే..

జిల్లావ్యాప్తంగా వచ్చిన దరఖాస్తుల్లో కేవలం 910 మాత్రమే పరిష్కరించారు. ఇంకా 23,510 పెండింగ్‌లో ఉన్నాయి. సమయం ఐదు రోజులే ఉండటంతో పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యే అవకాశాలు కన్పించడం లేదు. వచ్చిన దరఖాస్తులను ఆయా సమస్యలను బట్టి తహసీల్దార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ నోటీసులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు చిన్నచిన్న సమస్యలకు సంబంధించి అప్‌డేట్‌ చేశారే కానీ పెద్ద సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. కొన్ని కోర్టులో సైతం పెండింగ్‌లో ఉండటంతో వాటిని పరిష్కరించాలన్నా కొన్ని టెక్నికల్‌ సమస్యలు వస్తున్నాయి.

రైతుల్లో ఆశలు

గతంలో ధరణి పోర్టల్‌ కొన్ని తప్పిదాలు ఉండటంతో రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఎక్కువ శాతం సర్వేనంబర్లు మిస్సింగ్‌ కా వడం, ఒకరి సర్వేనంబర్లు మరొక రైతులకు రావడంతో ఇబ్బందులకు గురయ్యారు. దీంతో భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకురావడంతో రైతుల్లో కొంత ఆశలు రేకెత్తాయి. చిన్నచిన్న సమస్యలు అనేకంగా పరిష్కారమ్యాయి. పూర్తిస్థాయిలో పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

ఆత్మకూర్‌ పెద్దవాగు ఇసుక రవాణాపై విమర్శలు

రీచ్‌ నుంచి అనుమతి లేకుండానే తరలింపు

ఇందిరమ్మ ఇళ్ల ఇసుకకూ డబ్బులు వసూలు

తాజాగా ‘సూరమ్మ’ పనులకు అనుమతులపై అభ్యంతరం

రీచ్‌ వద్దంటూనే ఇసుక తవ్వకాలు..

మెట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ప్రభుత్వ అధికారి తన ఇంటి నిర్మాణ పనులకు ఇసుక కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. డీడీ తీసి కార్యాలయంలో అందించారు. ఆత్మకూర్‌ రీచ్‌ నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో ఇసుక కోసం ట్రాక్టర్లు వాగుకు వెళ్లగా కొందరు అడ్డుకున్నారు. అధికారులు హెచ్చరించినప్పటికీ వినకుండా రాద్దాంతం చేశారు. చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో ట్రాక్టర్లను అక్కడి నుంచి పంపించారు. ఇలా అనుమతి తీసుకున్న వారు ఇసుక తీసుకెళ్లేందుకు ఇబ్బంది పడుతుండగా.. అనుమతి లేకుండా ఇసుక యథేచ్ఛగా తరలిపోతోంది.

‘భూభారతి’ సమస్యలు పరిష్కారమయ్యేనా..?

ఈనెల 15వ తేదీ గడువు

ఒకవైపు సిబ్బంది కొరత

మరోవైపు సమస్యలపై స్పష్టత కరువు

జిల్లాలో మొత్తం దరఖాస్తులు 24,420

పరిష్కరించే దిశగా చర్యలు

భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. దాదాపు గడువులోపు పూర్తి చేసేలా చూస్తాం. ఆన్‌లైన్‌లో అన్ని దరఖాస్తులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రతి సమస్యకు నోటీసులు జారీ చేశాం. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం.

– సత్యప్రసాద్‌, కలెక్టర్‌

మిగిలింది ఐదు రోజులే..!1
1/7

మిగిలింది ఐదు రోజులే..!

మిగిలింది ఐదు రోజులే..!2
2/7

మిగిలింది ఐదు రోజులే..!

మిగిలింది ఐదు రోజులే..!3
3/7

మిగిలింది ఐదు రోజులే..!

మిగిలింది ఐదు రోజులే..!4
4/7

మిగిలింది ఐదు రోజులే..!

మిగిలింది ఐదు రోజులే..!5
5/7

మిగిలింది ఐదు రోజులే..!

మిగిలింది ఐదు రోజులే..!6
6/7

మిగిలింది ఐదు రోజులే..!

మిగిలింది ఐదు రోజులే..!7
7/7

మిగిలింది ఐదు రోజులే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement