
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్: రాజకీయాలకతీతంగా పనిచేసి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం రాయికల్ మండలం సింగరావుపేట, కిష్టంపేట గ్రామాల్లో రూ.10 లక్షల ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సింగరావుపేటలో మారంపల్లి మహేశ్, మహంకాళి రాజం, గంగరాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని తెలిపారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పక్షాన ప్రజలు ఉండాలన్నారు. దశాబ్దాల కాలం తర్వాత నూతన రేషన్‌కార్డుల పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీ, రైతు భరోసాతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా మారిందన్నారు. కార్యక్రమంలో రాంచందర్‌రావు, జానగోపి, జాన గంగాధర్, రవిగౌడ్, రవిందర్‌రావు, ముఖీద్, భీమయ్య, సిరిపురం సత్తయ్య, ఆదిరెడ్డి, జీవన్‌రెడ్డి, రాజమౌళి పాల్గొన్నారు.
ఆలయాల అభివృద్ధికి కృషి
జగిత్యాలరూరల్: ఆలయాల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే అన్నారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి, బావోజీపల్లిలో హనుమాన్ ఆలయానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ మొగలుల పాలనలో ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయని, మన చరిత్ర మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలని సూచించారు. ముందుగా ఇవే ఆలయానికి జెడ్పీ చైర్‌పర్సన్ భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు సదాశివరావు, ప్రకాశ్, శంకర్, శేఖర్, శాంతపురావు, రవీందర్‌రావు పాల్గొన్నారు.