
బీసీలపై కపట ప్రేమ
జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లపై కపట ప్రేమ చూపుతోందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. ఢిల్లీలో నామమాత్రంగా ధర్నా చేసి బీసీలను మోసం చేయాలని చూస్తోందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తే కనీసం రాహుల్‌గాంధీ వచ్చి మద్దతివ్వలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి దీనిని బట్టే అర్థమవుతోందన్నారు.
మహిళా సాధికారతకు తోడ్పాటు
ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించిన డాక్టర్ బీఎన్.రావు
మల్యాల: మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగి, సాధికారత సాధించేందుకు తోడ్పాటు అందిస్తోందని బీఎన్.రావు హెల్త్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బీఎన్.రావు అన్నారు. గురువారం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ద్వారా బీఎన్.రావు హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హుజూరాబాద్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన నిరుపేద మహిళలను ఎంపిక చేసి నెలపాటు ఉచితంగా శిక్షణ ఇస్తామని, అనంతరం సర్టిఫికెట్లు అందిస్తామని వివరించారు. ఫౌండేషన్ కార్యదర్శి ఝాన్సీ, డక్టార్ శ్రీదేవి, గంగ, న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ జి.రమేశ్ పాల్గొన్నారు.
‘ఉల్లాస్’పై శిక్షణ
మాట్లాడుతున్న డీఈవో రాము
జగిత్యాల: జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచేందుకు ప్రతి గ్రామంలో స్వచ్ఛంద వాలంటీర్లు, టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రాము తెలిపారు. జిల్లాకేంద్రంలోని టీచర్స్ భవన్‌లో ఆర్పీలతో గురువారం సమావేశమయ్యారు. జిల్లాలో ఎంపికై న ప్రతి మండలం నుంచి ఇద్దరు రిసోర్స్ పర్సన్లను నియమించామని, ప్రతిఒక్క మహిళను అక్షరాస్యులుగా చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 70.31 శాతం పురుషులు, మహిళలు 50.6 శాతం అక్షరాస్యులుగా ఉన్నారని, వందశాతం అక్షరాస్యులను చేయాలన్నారు. ఉల్లాస్ కో–ఆర్డినేటర్ ప్రతాప్‌రావు, సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ మహేశ్ పాల్గొన్నారు.

బీసీలపై కపట ప్రేమ

బీసీలపై కపట ప్రేమ