
విద్యార్థులు వందశాతం హాజరు ఉండాలి
● విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్
జగిత్యాల: విద్యార్థులు వందశాతం హాజరు ఉండేలా చూడాలని విద్యాశాఖ రాష్ట్ర పరిశీలకులు దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, భవితసెంటర్లు, కేజీబీవీలను పరిశీలించారు. ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలతో సమీక్షించారు. యూడైస్ స్లోగా ఉందని, విద్యార్థులు నమోదయ్యేలా చూడాలని, స్టూడెంట్ ప్రొఫైల్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. విద్యార్థులతో ఇన్‌స్పైర్ అవార్డుల నామినేషన్లు, వనమహోత్సవం నిర్వహణ అమలు చేసేలా చూడాలన్నారు. ఆయన వెంట డీఈవో రాము ఉన్నారు.
తాటిపల్లి గురుకులంలో..
మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులాన్ని దుర్గాప్రసాద్ సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. గ్రంథాలయం, ల్యాబ్‌ల వినియోగంపై విద్యార్థులతో మాట్లాడారు. ఇంటర్, పదో తరగతిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడంపై ఉపాధ్యాయులను అభినందించారు. ఎంఈవో జయసింహారావు, సెక్టోరియల్ అధికారి రాజేశ్, ప్రిన్సిపాల్ మానస, ఏపీఓ రమణ పాల్గొన్నారు.