
ఇసుక తవ్వకాలపై వివాదం
మెట్‌పల్లి రూరల్: మెట్‌పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగు రీచ్ నుంచి ఇసుక తరలించే విషయంలో వివాదం చోటుచేసుకుంది. రీచ్ నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు వచ్చిన వాహనాలను గ్రామస్తులు గురువారం అడ్డుకున్నారు. కథలాపూర్ మండలం కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ పనులకు 2500 క్యూబిక్ మీటర్ల ఇసుకకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. ఇసుక కోసం వాగు వద్దకు వెళ్లిన టిప్పర్లు, పొక్లెయినర్‌ను గ్రామస్తులు తిప్పి పంపించేశారు. మెట్‌పల్లి తహసీల్దార్ నీత, ఎస్సై కిరణ్‌కుమార్, ఆర్‌ఐ ఉమేశ్ వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. అనుమతి ఉండగా అడ్డుకోవడం సరికాదన్నారు.